రజనీకాంత్ ‘కూలీ’ కోసం మలయాళీ స్టార్

సూపర్ స్టార్ రజనీకాంత్ సూపర్ స్పీడులో సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ‘జై భీమ్’ ఫేమ్ టి.జె. ఙ్ఞాన్‌వేల్ డైరెక్షన్ లో ‘వెట్టైయాన్’ సినిమాని పూర్తి చేశాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో స్టార్ కాస్ట్ మామూలుగా లేదు. బాలీవుడ్ వెటరన్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ మొదలుకొని.. రానా, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్, రితిక సింగ్, దుషారా విజయన్ వంటి చాలామంది తారలు ఈ సినిమాలో నటిస్తున్నారు. దసరా కానుకగా ‘వెట్టైయాన్’ విడుదలకు ముస్తాబవుతోంది.

ఇక.. ఇప్పుడు తన అప్‌కమింగ్ మూవీ ‘కూలీ’ కోసం రెడీ అవుతున్నాడు రజనీకాంత్. క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే రజనీకాంత్ ‘వెట్టైయాన్’లో నటించిన మలయాళీ యాక్టింగ్ పవర్ హౌజ్ ఫహాద్ ఫాజిల్.. ‘కూలీ’ చిత్రంలోనూ నటించబోతున్నాడట.

గతంలో లోకేష్ డైరెక్ట్ చేసిన ‘విక్రమ్’ సినిమాలో కీ రోల్ లో కనిపించాడు ఫహాద్. అలా.. రజనీకాంత్ తో ‘వెట్టైయాన్’ తర్వాత, లోకేష్ కనకరాజ్ తో ‘విక్రమ్’ తర్వాత ఫహాద్ ఇప్పుడు ‘కూలీ’ సినిమా కోసం పనిచేయబోతున్నాడన్నమాట.

Related Posts