‘కల్కి‘ ట్రైలర్ కి రాజమౌళి కాంప్లిమెంట్స్

లేటెస్ట్ గా వచ్చిన ‘కల్కి‘ రిలీజ్ ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన గంటల్లోనే ఈ ట్రైలర్ యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ ను కొల్లగొట్టింది . సాదారణ సినీ ప్రియులు మాత్రమే కాదు.. సెలబ్రిటీలు సైతం ‘కల్కి‘ ట్రైలర్ కు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ లిస్టులో ప్రథమంగా చెప్పుకోవాల్సింది దర్శకధీరుడు రాజమౌళి. ‘కల్కి‘ ట్రైలర్ చూసిన జక్కన్న.. ఈ ట్రైలర్ కి తనదైన శైలిలో రివ్యూ అందించాడు.

‘కల్కి‘ ట్రైలర్ చాలా పవర్ ప్యాక్డ్ గా ఉందని.. ఈ ట్రైలర్ ను చూసిన వెంటనే సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో ఎప్పుడెప్పుడు చూస్తానా? అని ఎదురుచూస్తున్నట్టు ‘ఎక్స్‘లో పోస్ట్ పెట్టాడు. ఇక.. అమితాబ్ జీ, డార్లింగ్ మరియు దీపిక క్యారెక్టర్స్ లలో ఎంతో డెప్త్ ఉన్నట్టు ట్రైలర్ ను బట్టి తెలుస్తోందని.. కమల్ సార్ లుక్ అయితే కేక అన్నట్టుగా తన పోస్ట్ తెలిపాడు రాజమౌళి. చివరగా.. నాగీ, నీ ప్రపంచంలోకి ఎంటరవ్వడానికి ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను అని.. తన పోస్ట్ కి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు జక్కన్న.

రాజమౌళితో పాటు.. విజయ్ దేవరకొండ, సాయిధరమ్ తేజ్, సందీప్ రెడ్డి వంగా, శోభు యార్లగడ్డ వంటి పలువురు సెలబ్రిటీలు ‘కల్కి‘ రిలీజ్ ట్రైలర్ పై ప్రశంసల జల్లు కురిపిస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

Related Posts