రాజ్ తరుణ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రియురాలు

యంగ్ హీరో రాజ్ తరుణ్‌ వివాదంలో చిక్కుకున్నాడు. రాజ్ తరుణ్ తనను ప్రేమించి, శారీరకంగా వాడుకుని వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని నార్సింగీ పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది లావణ్య అనే యువతి. 11 ఏళ్లపాటు రిలేషన్ లో ఉన్న తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వదిలేసి వెళ్లిపోయాడని తన ఫిర్యాదులో తెలిపింది లావణ్య.

తాము విడిపోవడానికి ఓ సినీ నటే కారణమని లావణ్య పేర్కొంది. రాజ్‌ తరుణ్ ను వదిలేయకపోతే చంపేస్తామని ఆ హీరోయిన్ తరపు వాళ్లు తనను బెదిరిస్తున్నారని తన ఫిర్యాదులో పోలీసులకు తెలిపింది. లావణ్య ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Related Posts