శరవేగంగా పూర్తవుతున్న ‘పుష్ప 2’

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప 2’ ఈ ఏడాది ఆగస్టు 15న విడుదలకు ముస్తాబవుతోంది. ఈనేపథ్యంలో.. ఈ సినిమాని శరవేగంగా పూర్తిచేస్తున్నాడు డైరెక్టర్ సుకుమార్. డెడ్ లైన్ ను మీట్ అవ్వడానికి ఒకేసారి రెండు, మూడు యూనిట్లతో షూటింగ్ కంప్లీట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. గ్రామీణ వాతావరణానికి సంబంధించిన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారట. ఇక.. ఈనెల చివరి వరకూ అల్లు అర్జున్ పోర్షన్ మొత్తం పూర్తవ్వనున్నట్టు తెలుస్తోంది.

జూలై మొదటి వారం నుంచి ‘పుష్ప 2’ ప్రమోషన్స్ లో బిజీ అవ్వనున్నాడట బన్నీ. ఈమధ్య ఈ సినిమా వి.ఎఫ్.ఎక్స్ విషయంలో సుకుమార్ నిరుత్సాహంగా ఉన్నాడనే న్యూస్ జోరుగా చక్కర్లు కొట్టింది. అయితే.. అవన్నీ దాటుకుని ఆగస్టు 15న ఎట్టిపరిస్థితుల్లోనూ సినిమాని విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాడట సుక్కూ. ఇప్పటికే ఈ చిత్రం నుంచి దేవిశ్రీప్రసాద్ స్వరాలందించిన రెండు పాటలు విడుదలయ్యాయి. త్వరలో మరో రెండు సాంగ్స్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘పుష్ప 2’ పాన్ ఇండియా లెవెల్ లో భారీ స్థాయిలో విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts