ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్శ్ వెబ్ సైట్

తొలి సినిమా ‘అ!’ తోనే జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న ఘనత యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ది. డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో చాలా తక్కువ బడ్జెట్ లో మంచి క్వాలిటీ అందిస్తూ సూపర్ హీరోస్ సినిమాలు చేయడంలో ఎక్స్‌పెర్ట్ అనిపించుకుంటున్నాడు ప్రశాంత్. అందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంఫుల్ ‘హనుమాన్’. పెద్దగా స్టార్ కాస్ట్ లేకుండానే రూపొందిన ఈ ఇండియన్ సూపర్ హీరో మూవీ.. పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. వరల్డ్ వైడ్ గా రూ.350 కోట్లు వసూళ్లను సాధించింది.

ప్రస్తుతం ‘హనుమాన్’ సినిమాకి సీక్వెల్ గా ‘జై హనుమాన్’ని రెడీ చేస్తున్నాడు. అలాగే.. తన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్శ్ లో భాగంగా వచ్చే సినిమాల విశేషాలను ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు తెలియజేసేలా ‘పి.వి.ఎస్.యు’ వెబ్ సైట్ ను డిజైన్ చేశాడు. నిన్న (మే 29) తన బర్త్ డే స్పెషల్ గా ఈ వెబ్ సైట్ ను లాంఛ్ చేశాడు ప్రశాంత్ వర్మ.

Related Posts