ఒకేసారి పట్టాలెక్కనున్న ప్రభాస్, ఎన్టీఆర్ చిత్రాలు

కన్నడ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్స్ ను లైన్లో పెట్టాడు. వాటిలో ఒకటి ప్రభాస్ ‘సలార్ 2‘ కాగా.. మరొకటి ఎన్టీఆర్ తో తెరకెక్కించే చిత్రం. ‘సలార్ 1‘ సెన్సేషనల్ హిట్ అవ్వడంతో.. ‘సలార్ 2‘ని వీలైనంత తొందరగా పూర్తిచేయాలని భావించాడు ప్రశాంత్ నీల్. ‘సలార్ 1‘తో పాటే.. సీక్వెల్ కి సంబంధించి 20 శాతం వరకూ షూటింగ్ పూర్తయ్యిందట. ఇప్పుడు సీక్వెల్ ని.. ఆగస్టు 10 నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడనే ప్రచారం ఉంది. హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ‘సలార్ 2‘ని కేవలం ఎనిమిది నెలల్లోనే పూర్తిచేసి.. వచ్చే యేడాది వేసవి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నాడట ప్రశాంత్.

మరోవైపు.. ఎన్టీఆర్ సినిమాని కూడా ఆగస్టు నుంచి సెట్స్ పైకి తీసుకెళతానని ప్రకటించాడు ప్రశాంత్. తారక్ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చాయట.

ఒకవైపు ప్రభాస్ తో ‘సలార్ 2‘.. మరోవైపు ఎన్టీఆర్ చిత్రాన్ని సైమల్టేనియస్ గా హ్యాండిల్ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడట డైరెక్టర్ ప్రశాంత్ నీల్.

Related Posts