బాలకృష్ణ-బోయపాటి సినిమాపై అధికారిక ప్రకటన

నటసింహం బాలకృష్ణ ఎనర్జీని ఆన్ స్క్రీన్ పై అద్భుతంగా ఆవిష్కరించే దర్శకుల్లో ముందు వరుసలో నిలుస్తాడు బోయపాటి శ్రీను. వీరిద్దరి కలయికలో వచ్చిన మూడు చిత్రాలూ ‘సింహా, లెజెండ్, అఖండ’ అద్భుతమైన విజయాలు సాధించాయి. అలా హ్యాట్రిక్ హిట్స్ అందించిన కాంబోగా పేరు తెచ్చుకున్న ‘బాలకృష్ణ-బోయపాటి’ కలయికలో నాల్గవ చిత్రం రూపొందబోతుందనే న్యూస్ కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వీరిద్దరూ కలిసి ‘అఖండ 2’ చేస్తారని.. గీతా ఆర్ట్స్ లో పని చేయబోతున్నారని.. ఇలా రకరకాల ప్రచారాలు జరిగాయి. అయితే.. లేటెస్ట్ గా ‘బి.బి.4’పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ‘ది మాసివ్ ఎపిక్ కాంబినేషన్ ఈజ్ బ్యాక్ ఎగైన్’ అంటూ.. ‘మన బాలయ్య బాబుకి జన్మదిన శుభాకాంక్షలు’ అని తెలియజేస్తూనే.. ‘బిబి 4’ని తాము నిర్మించబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది ’14 రీల్స్ ప్లస్’ సంస్థ. ఈ సినిమాని రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మించబోతున్నారు. త్వరలోనే.. ఈ చిత్రానికి సంబంధించి ఇతర కాస్ట్ అండ్ క్రూ డిటెయిల్స్ తెలియనున్నాయి.

Related Posts