మెక్సికోలో మొదలుపెట్టనున్న ‘ఎన్టీఆర్-నీల్’

ఇండియన్ సినీ ఇండస్ట్రీ నుంచి గ్లోబల్ లెవెల్ లో రాబోయే క్రేజీ మూవీస్ లో ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఒకటి. ఈ సినిమాకి ‘ఎన్టీఆర్-నీల్’ అనేది వర్కింగ్ టైటిల్. అసలు ఈపాటికే పట్టాలెక్కాల్సిన ఈ సినిమా వీరిద్దరూ ప్రయర్ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉండడంతో కాస్త ఆలస్యమయ్యింది. అయితే.. ఇటీవలే ఎన్టీఆర్ బర్త్‌డే స్పెషల్ గా ‘ఎన్టీఆర్-నీల్’ ప్రాజెక్ట్ ఆగస్టు నుంచి పట్టాలెక్కనుందని ప్రకటించారు. ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇక.. ఇప్పటివరకూ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ‘కె.జి.యఫ్’ సిరీస్, ‘సలార్’ ఇండియాలోనే చిత్రీకరణ జరుపుకున్నాయి. అయితే.. ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ను ఎక్కువగా విదేశాల్లోనే పూర్తిచేయనున్నాడట ప్రశాంత్ నీల్. ఈ సినిమాని ఈ ఆగస్టు నుంచి మెక్సికోలో మొదలుపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఆ తర్వాత మరికొన్ని దేశాల్లో వరుస షెడ్యూల్స్ తో ఈ సినిమాని పూర్తిచేయనున్నారట. ఈ మూవీలో ఎన్టీఆర్ కి జోడీగా కియారా అద్వానీ లేదా రష్మిక నటిస్తుందనే ప్రచారం జరుగుతోంది. అలాగే.. ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్శ్ లో ఎన్టీఆర్ ప్రాజెక్ట్ భాగం కానుందా? లేదా? అనే విషయాలపైనా త్వరలోనే క్లారిటీ రానుంది.

Related Posts