సెప్టెంబర్ 27న రానున్న ఎన్టీఆర్ ‘దేవర‘

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర‘ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదలకాబోతున్నట్టు ప్రకటించారు. అయితే.. పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న ఈ మూవీకి.. దసరా బరిలో ఇంకా పలు భాషల నుంచి పెద్ద కాంపిటేషన్ ఉండబోతుంది. రజనీకాంత్ ‘వేట్టైయాన్‘ దసరా కానుకగా అదే తేదీకి ఫిక్సైంది. అలాగే.. నటసింహం బాలకృష్ణ 109వ సినిమా కూడా దసరా బరిలోనే రాబోతుందనే ప్రచారం ఉంది.

ఈనేపథ్యంలో.. ‘దేవర‘ సినిమాని రెండు వారాలు ముందుగానే అంటే సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. సెప్టెంబర్ 27 నుంచి వరుస సెలవులు వస్తుండడం కూడా ‘దేవర‘కి ప్లస్ అవుతుందని భావించింది టీమ్. ఈనేపథ్యంలో.. ఆ డేట్ కి ఫిక్స్ అయ్యారట. అసలు సెప్టెంబర్ 27న పవన్ కళ్యాణ్ ‘ఓజీ‘ విడుదల కావాల్సి ఉంది. పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడంతో ఆ సమయానికి ‘ఓజీ‘ రావడం కష్టమేననే సంకేతాలందాయి. ఈనేపథ్యంలోనే.. ‘దేవర‘ సెప్టెంబర్ 27కి ఫిక్సైనట్టు ఫిల్మ్ నగర్ టాక్.

కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుంది. విలన్ గా సైఫ్ ఆలీ ఖాన్ కనిపించబోతున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంయుక్తంగా ‘దేవర‘ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అనిరుధ్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే టైటిల్ సాంగ్ రిలీజయ్యింది.

Related Posts