‘సరిపోదా శనివారం‘ నుంచి నాని సెకండ్ లుక్

మిగతా రోజుల్లో మామూలుగా ఉండే సూర్య.. శనివారం మాత్రం రెచ్చిపోతుంటాడు. ఇప్పటికే ‘సరిపోదా శనివారం‘ చిత్రంలో సూర్య పాత్రలో నాని చూపించే యాక్షన్ అవతార్ ను ప్రచార చిత్రాల్లో చూశాము. ఇప్పుడు నాని లోని మరో యాంగిల్ ను చూపిస్తూ కొత్త లుక్ రిలీజ్ చేసింది టీమ్. ఈ లుక్ లో ఓ సాధారణ యువకుడిగా.. పక్కింటబ్బాయిగా అదరగొడుతున్నాడు నేచురల్ స్టార్.

ఇప్పటికే నాని తో ‘అంటే సుందరానికి‘ సినిమా తీసిన వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో నానికి జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుంది. గతంలో వీరిద్దరూ కలిసి ‘గ్యాంగ్ లీడర్‘ సినిమాలో నటించారు. ఎస్.జె.సూర్య మరో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Related Posts