పురాణ పురుషుల పాత్రల్లో నాని, విజయ్ దేవరకొండ

‘కల్కి’ సినిమాకోసం ద్వాపర యుగం నాటి మహాభారత యుద్ధం నుంచి.. కలి యుగం వరకూ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఈ సినిమాకోసం సరికొత్త పాయింట్ తో నెవర్ బిఫోర్ విజువల్ ట్రీట్ అందించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక.. ‘కల్కి’ సినిమాలో ఇప్పటివరకూ బయటకు వచ్చింది గోరంత మాత్రమే.. ఇంకా చూడాల్సింది కొండంత ఉందంటూ చిత్రబృందం చెబుతోంది. కాస్టింగ్ పరంగానూ ఈ సినిమాలో ఎంతోమంది తారలు సందడి చేయబోతున్నారట.

ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్ మొదలుకొని.. బాలీవుడ్ నుంచి లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ తో పాటు.. విశ్వనటుడు కమల్ హాసన్, దీపిక పదుకొణె, దిశా పటాని వంటి భారీ తారాగణం ఉంది. వీరితో పాటు మరో ఇద్దరు స్టార్స్ కూడా ‘కల్కి’లో కేమియోస్ తో మురిపించబోతున్నారట. వాళ్లే నాని, విజయ్ దేవరకొండ. గత కొన్ని నెలలుగా ‘కల్కి’ సినిమాలో నాని, విజయ్ దేవరకొండ కనిపించబోతున్నారనే ప్రచారం ఉంది. అయితే.. వాళ్లు ఏ పాత్రల్లో కనువిందు చేయబోతున్నారనే దానిపై లేటెస్ట్ గా ఫిల్మ్ సర్కిల్స్ లో కొన్ని కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.

నాగ్ అశ్విన్ డెబ్యూ మూవీ ‘ఎవడే సుబ్రహ్మణ్యం’లో నాని, విజయ్ దేవరకొండ కలిసి నటించారు. ఇక.. ‘కల్కి’ సినిమాలో నాని శ్రీకృష్ణుడుగా, విజయ్ దేవరకొండ అర్జునుడు పాత్రలోనూ కనిపించనున్నారట. ఈ సినిమాలో ఈ పురాణ పురుషుల పాత్రల్లో అతిథులుగా మెరవబోతున్నారట నాని, విజయ్ దేవరకొండ. మొత్తానికి.. త్వరలోనే ‘కల్కి’లో నాని, విజయ్ ఎంట్రీపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందేమో చూడాలి.

Related Posts