ముచ్చటగా మూడోసారి నాగార్జున-పూరి కాంబో

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాల స్పీడు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ లో జెట్ స్పీడులో సినిమాలు తెరకెక్కించే డైరెక్టర్ గా పూరి జగన్నాథ్ కి స్పెషల్ ఇమేజ్ ఉంది. ఇక.. పూరి జగన్నాథ్ తో ఒక సినిమా చేసిన హీరోలు మళ్లీ అతనితోనే వెంటనే రెండో సినిమాని చేస్తుంటారు. ఈ లిస్టులో కింగ్ నాగార్జున కూడా ఉన్నాడు. వీరిద్దరి కాంబోలో ‘శివమణి, సూపర్’ వంటి చిత్రాలొచ్చాయి.

‘సూపర్’ సినిమాతోనే అందాల అనుష్క కథానాయికగా పరిచయమయ్యింది. ఇక.. మళ్లీ 19 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత నాగార్జున-పూరి కాంబోలో సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయట. ఇటీవలే నాగార్జునకు.. పూరి జగన్నాథ్ ఓ స్టోరీ లైన్ వినిపించడం.. అది ఆయనకు నచ్చడం జరిగిందట. కమింగ్ డేస్ లో వీరిద్దరి కాంబోలో మూడో సినిమా సెట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు ఫిల్మ్ నగర్ టాక్.

నాగార్జున ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ సినిమా చేస్తున్నాడు. ధనుష్ మెయిన్ లీడ్ లో చేస్తున్న ఈ మూవీలో నాగార్జున సపోర్టింగ్ క్యారెక్టర్ లో సందడి చేయబోతున్నాడు.

మరోవైపు.. పూరి జగన్నాథ్ ‘డబుల్ ఇస్మార్ట్’తో బిజీగా ఉన్నాడు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ‘ఇస్మార్ట్ శంకర్’కి సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ రాబోతుంది.

Related Posts