‘డార్లింగ్‘ నుంచి నభా నటేష్ ‘రాహి రే‘ సాంగ్

ప్రియదర్శి, నభా నటేష్ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘డార్లింగ్‘. ఈ మూవీలో అనన్య నాగళ్ల, మోయిన్, శివారెడ్డి, మురళీధర్ గౌడ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అశ్విన్ రామ్ డైరెక్షన్ లో ‘హనుమాన్‘ నిర్మాత నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన్ ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి ‘రాహి రే‘ అనే సాంగ్ రిలీజయ్యింది. వివేక్ సాగర్ సంగీతంలో కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను కపిల్ కపిలన్ ఆలపించాడు. కాశ్మీర్ వంటి అందమైన ప్రదేశాల్లో హీరోయిన్ నభా నటేష్ పై చిత్రీకరించిన ఈ మాంటేజ్ సాంగ్ అందంగా ఆకట్టుకుంటుంది. జూలై 19న ‘డార్లింగ్‘ విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts