జూన్ 14కి మారిన ‘మ్యూజిక్ షాప్ మూర్తి’

విభిన్నమైన పాత్రలతో క్యారెక్టర్ యాక్టర్ గా ఫుల్ బిజీగా సాగుతోన్న అజయ్ ఘోష్ హీరోగా నటించిన చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి‘. ఈ సినిమాలో యువ కథానాయిక చాందినీ చౌదరి మరో ప్రధాన పాత్ర పోషించింది. ఫ్లై హై సినిమాస్ బ్యానర్ మీద హర్ష గారపాటి, రంగారావు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు.

శివ పాలడుగు ఈ సినిమాకి రచన, దర్శకత్వం వహించారు. ఓ విభిన్నమైన పాయింట్ తో ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ చిత్రాన్ని తీసుకురాబోతున్నారట మేకర్స్. అసలు మే 31నే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే.. లేటెస్ట్ గా ఈ సినిమా జూన్ 14కి షిప్టయ్యింది. ఇప్పటికే మే 31 నుంచి జూన్ 14న మారిన సినిమా జాబితాలో సుధీర్ బాబు ‘హరోం హర‘ కూడా ఉంది.

Related Posts