రెండు భాగాలుగా మహేష్-రాజమౌళి చిత్రం

ఒక సినిమాని డైరెక్ట్ చేశామా? వచ్చేశామా అన్నట్టు కాకుండా.. అహర్నిశలు ఆ సినిమా గురించే ఆలోచించి.. ఆ చిత్రాన్ని ఆడియన్స్ కు దగ్గరచేయడం వరకూ అన్ని బాధ్యతలు తానే తీసుకుంటాడు దర్శకధీరుడు రాజమౌళి. నిర్మాత ఎవరైనా.. తన సినిమాకి సంబంధించి అంతిమ నిర్ణయం మాత్రం రాజమౌళిదే. జక్కన్న పై ఉన్న నమ్మకంతో నిర్మాతలు కూడా సినిమాపై సర్వ నిర్ణయాలు దర్శకధీరుడుపైనే వదిలేస్తుంటారు.

తెలుగు సినిమాతో పాటు.. భారతీయ సినిమాని కూడా అంతర్జాతీయ వేదికపై నిలబెట్టిన చిత్రంగా ‘బాహుబలి’ని చెప్పొచ్చు. తొలుత ఒక భాగంగానే మొదలైన ‘బాహుబలి’ని బడ్జెట్ దృష్ఠ్యా రెండు భాగాలుగా మార్చాడు రాజమౌళి. రెండు పార్ట్స్ ను అద్భుతంగా తీర్చిదిద్ది.. భారీ విజయాలను సొంతం చేసుకున్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో టూ పార్ట్స్ మూవీస్ కు దిశా నిర్దేశం చేసిన ‘బాహుబలి’ బాటలోనే.. ‘కె.జి.యఫ్, పొన్నియన్ సెల్వన్’ వంటి చిత్రాలొచ్చాయి. ఇప్పుడు ‘పుష్ప’ కూడా అదే కోవలో వస్తోంది. ఇక.. ‘బాహుబలి’ ఫార్ములానే ఇప్పుడు మహేష్ మూవీకి కూడా అప్లై చేయబోతున్నాడట జక్కన్న.

‘ఆర్.ఆర్.ఆర్’తో గ్లోబల్ లెవెల్ లో తన బ్రాండ్ ను చాటిచెప్పిన జక్కన్న.. మహేష్ మూవీని ఇంటర్నేషనల్ లెవెల్ లో తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడు. దాంతో.. ఈ మూవీ బడ్జెట్ కూడా వెయ్యి కోట్లు దాటే అవకాశాలున్నాయట. ఈనేపథ్యంలోనే.. ఈ సినిమాని రెండు భాగాలుగా తీసుకురావాలని డిసైడయ్యాడట దర్శకధీరుడు. రెండు భాగాలకు సరిపోయే కథ కూడా సెట్టవ్వడంతో.. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రాజమౌళి నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

Related Posts