‘ఓజీ’ డేట్ కే వస్తోన్న ‘లక్కీ భాస్కర్’

మాతృ భాష మలయాళంలో స్టార్ స్టేటస్ అనుభవిస్తూనే.. పరభాషల్లోనూ దుమ్మురేపుతోన్న కథానాయకుడు దుల్కర్ సల్మాన్. తెలుగులో ‘మహానటి, సీతారామం’ వంటి సినిమాలతో భారీ విజయాలందుకున్న దుల్కర్.. ఇప్పుడు ముచ్చటగా తన మూడో తెలుగు సినిమాతో సిద్ధమవుతున్నాడు. అదే ‘లక్కీ భాస్కర్’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వంటి బడా సంస్థ నుంచి వస్తోన్న ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకుడు.

ఈ చిత్రంలో దుల్కర్ కి జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తోంది. పీరియడిక్ బ్యాక్‌డ్రాప్ తో ఓ బ్యాంక్ ఎంప్లాయ్ కథాంశంగా ‘లక్కీ భాస్కర్’ను తీర్చిదిద్దుతున్నాడు వెంకీ అట్లూరి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో ఓ వైవిధ్యభరిత చిత్రంగా పేరు తెచ్చుకున్న ‘లక్కీ భాస్కర్’ లేటెస్ట్ గా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ రాబోతున్న సెప్టెంబర్ 27నే ‘లక్కీ భాస్కర్’ విడుదలకు ముస్తాబవుతోంది. అందుకు సంబంధించి ఓ పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్.

Related Posts