కుమారి శ్రీమతి.. ఫన్నీ టీజర్

టాలెంటెడ్ బ్యూటీ నిత్య మీనన్ కొంత గ్యాప్ తర్వాత తెలుగు సినిమా చేసింది. వైజయంతి నెట్ వర్క్స్ లో స్వప్న సినిమా బ్యానర్ లో రూపొందిన ఆ సినిమా కుమారి శ్రీమతి. అయితే ఇది థియేట్రికల్ మూవీ కాదు.ఓటిటి బొమ్మ. అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.

ఆ మధ్య అనౌన్స్ చేసిన ఈ మూవీ టైటిల్ మోషన్ పోస్టర్ తోనే ఆమె పాత్ర ఎలా ఉండబోతోందనే హింట్ ఇచ్చారు. అందుకు తగ్గట్టు కాదు.. అంతకు మించి అనేలా లేటెస్ట్ గా విడుదల చేసిన టీజర్ చూస్తే అర్థం అవుతుంది. ఈ టీజర్ ను కీర్తి సురేష్ విడుదల చేసింది. చాలా చిన్న టీజర్. కానీ మెయిన్ లీడ్ చేసిన నిత్య మీనన్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందనే క్లారిటీ ఇచ్చారు.

సిరి (నిత్య) ఓ చిన్న బిజినెస్ చేస్తూ ఉంటుంది. నిక్కచ్చి మనిషి. వయసు పెరిగినా పెళ్లి మాత్రం వద్దంటుంది. దీంతో ఆమె తల్లి ఎన్ని సంబంధాలు తెచ్చినా.. చేసుకోవడం లేదని నిష్టూరాలాడుతూ ఉంటుంది. అయినా పట్టించుకోదు. తనే తన కుటుంబాన్ని పోషించాలనే మొండిపట్టుదల ఉన్న మహిళ ఈ సిరి. అలా ఓ పెళ్లికి వెళ్లిన ఆమెను చూసి ఓ ముసలావిడ.. ఏమ్మా సిరీ నీకన్నా అది చాలా చిన్న పిల్ల.. దానికీ పెళ్లైపోతుంది.. మరి నువ్వెప్పుడు పప్పన్నం పెడతావ్..” అంటే.. “మొన్ననే పాపాయమ్మగారు పోయిందట.. నీకన్నా చిన్నది.. మరి నువ్వెప్పుడు పెడుతున్నావ్ గారెలు..” అంటూ గడుసుగా బదులిచ్చిందీ సిరి. దీన్ని బట్టి ఈ సిరి ఎంత స్ట్రాంగో అర్థం కావడం లేదూ..?


ఇక ఈ టీజర్ లో ఉన్న మరో విశేషం ఏంటంటే.. నిన్నటి వరకూ చాలా బొద్దుగా కనిపించి.. హీరోయిన్ పాత్రలకు ఇక పనికి రాదు అన్న కమెంట్స్ ఫేస్ చేసిన నిత్య మీనన్ పూర్తిగా సన్నబడింది. మళ్లీ తన పాత షేప్స్ కు వచ్చింది. ఇప్పుడు తన పర్సనాలిటీ చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అరే ఇంత సన్నబడిందే. ఇదేదో ముందే చేసి ఉంటే మరిన్ని ఆఫర్స్ వచ్చి ఉండేవి కదా అనుకుంటున్నారు. ఏదేమైనా ఈ టాలెంటెడ్ బ్యూటీకి తగ్గ కథలా ఉందీ కుమారి శ్రీమతి.

Related Posts