మెగా ఫ్యామిలీకి లక్ తీసుకొచ్చిన క్లిన్ కారా

మెగా వారసురాలు క్లిన్ కారా కడుపులో ఉండగానే.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి ఆస్కార్ దక్కింది. ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ వచ్చింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారం లభించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని నాగేశ్వరరావు తర్వాత పద్మవిభూషణ్ అందుకున్న రెండో నటుడు చిరంజీవి.

ఇక.. లేటెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో పవన్ కళ్యాణ్ సాధించిన విక్టరీ కూడా మెగా ఫ్యామిలీకి అమితమైన ఆనందాన్ని పంచింది. పోటీచేసిన 21 అసెంబ్లీ స్థానాల్లోనూ, 2 పార్లమెంట్ స్థానాల్లోనూ ఘన విజయాన్ని సాధించి.. సెంట్ పర్సెంట్ రిజల్ట్ పొందిన పార్టీగా జనసేన రికార్డు సృష్టించింది.

మధ్యలో మెగా కాంపౌండ్ నుంచే వచ్చిన అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడుగా జాతీయ పురస్కారం లభించింది. తొమ్మిది దశాబ్దాల తెలుగు చిత్ర పరిశ్రమలో తొలిసారి ఓ తెలుగు చిత్రానికి ఉత్తమ నటుడుగా అవార్డు అందుకున్న ఖ్యాతి సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్.

మెగా ఫ్యామిలీలో ఇన్ని వరుస విజయాల వెనుక.. ఆ కుటుంబంలోకి క్లిన్ కారా అడుగు పెట్టిన వేళా విశేషమే కారణమని మెగాభిమానులు నమ్ముతున్నారు. ప్రస్తుతం నెట్టింట జోరుగా ఇది ట్రెండ్ అవుతోంది. క్లిన్ కారా జూన్ 20, 2023న జన్మించింది.

Related Posts