‘కల్కి‘ గిఫ్ట్స్ తో ఆడుకుంటున్న క్లీంకార

‘కల్కి‘ ప్రచారంలో కొత్త పదనిసలు పలికిస్తుంది టీమ్. ఈ సినిమాలో భైరవ పాత్రలో ప్రభాస్ స్టికర్స్, బుజ్జి కారు బొమ్మలు, టీ షర్ట్స్ ను విక్రయిస్తూ.. ‘కల్కి‘కి ఓ రేంజులో ప్రమోషన్స్ చేస్తోంది చిత్రబృందం. ఇక.. లేటెస్ట్ గా సెలబ్రిటీ కిడ్స్ కోసం ‘కల్కి‘ గిఫ్ట్స్ టీమ్ పంపిస్తున్నారు.

ఇప్పటికే ఎన్టీఆర్ పిల్లల కోసం ప్రత్యేకమైన గిఫ్ట్స్ పంపించిందట టీమ్. తాజాగా.. రామ్ చరణ్ -ఉపాసన కూతురు క్లీంకార కు కూడా ‘కల్కి‘ గిఫ్ట్స్ అందాయట. ‘థ్యాంక్స్ కల్కి టీమ్. ఆల్ ది బెస్ట్’ అంటూ క్లీంకార.. బుజ్జి బొమ్మతో ఆడుకుంటున్న ఫొటోను ఉపాసన తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది.

Related Posts