కళ్యాణ్ రామ్ 21 మూవీ అనౌన్స్ మెంట్ గ్లింప్స్

సినిమా సినిమాకి కథల ఎంపికలో ఎంతో వైవిధ్యాన్ని చూపిస్తుంటాడు కళ్యాణ్ రామ్. ‘బింబిసార, అమిగోస్, డెవిల్‘ వంటి విభిన్న కథా చిత్రాల తర్వాత.. తాజాగా కొత్త సినిమాని ప్రకటించాడు. కళ్యాణ్ రామ్ 21వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ మూవీ అనౌన్స్ మెంట్ గ్లింప్స్ ను.. నటరత్న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా విడుదల చేశారు.

ఫిస్ట్ ఆఫ్ ఫ్లేమ్ అంటూ రిలీజ్ చేసిన ఈ వీడియోలో కళ్యాణ్ రామ్ సరికొత్త మేకోవర్ తో కనిపిస్తున్నాడు. ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తుండగా అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘కాంతార, విరూపాక్ష‘ ఫేమ్ అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.

Related Posts