హృద్యంగా ‘హాయ్ నాన్న‘ టీజర్

నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ ‘హాయ్ నాన్న‘. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాకి శౌర్యువ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. మోహన్ చెరుకూరి, డా.విజయేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ‘హాయ్ నాన్న‘ టీజర్ రిలీజయ్యింది.

ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్స్ తో మొదలైన టీజర్.. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తో నాని లవ్ ఎపిసోడ్స్ తో ఆసక్తికరంగా మారింది. నాని, మృణాల్ మధ్య లిప్ లాక్స్ కూడా ఎక్కువగానే చూపించారు. ఓవరాల్ గా నాన్న గా, లవర్ గా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నాని తన నేచురల్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టబోతున్నట్టు టీజర్ ను బట్టి తెలుస్తోంది. కూతురు పాత్రలో బేబి కియారా ఖన్నా, హీరోయిన్ మృణాల్ కూడా టీజర్ లో తమ మెస్మరైజింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నారు. మలయాళం మ్యూజికల్ సెన్సేషన్ హేషమ్ అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకి ప్లస్ కాబోతుంది. అలాగే.. ఈ టీజర్ ను చూస్తుంటే నాగార్జున ‘సంతోషం‘ మూవీ స్టోరీ కూడా గుర్తు రాక మానదు. మొత్తంమీద.. ‘హాయ్ నాన్న‘ టీజర్ హృద్యంగా ఆకట్టుకుంటోంది.

Related Posts