గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో ‘యుఫోరియా‘

తెలుగులో చారిత్రక, పౌరాణిక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటాడు గుణశేఖర్. అయితే.. ఈసారి వాటికి భిన్నంగా ‘యుఫోరియా‘ అనే కొత్త సినిమాతో రాబోతున్నాడు. గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసింది టీమ్. ఈ సినిమాకి రచయిత, దర్శకుడు గుణశేఖర్.

మరోవైపు.. గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో సమంత టైటిల్ రోల్ లో రూపొందిన ‘శాకుంతలం‘ గత ఏడాది విడుదలై డిజాస్టర్ గా మిగిలింది. ‘శాకుంతలం‘ తర్వాత రానా హీరోగా ‘హిరణ్యకశ్యప‘ చేస్తానని ప్రకటించాడు గుణశేఖర్. అయితే.. అదే ప్రాజెక్ట్ ను రానా మరో దర్శకుడితో చేసే సన్నాహాల్లో ఉన్నాడనే వార్తలొచ్చాయి. ఈనేపథ్యంలో.. ఇప్పుడు ‘యుఫోరియా‘ అనే కొత్త సినిమాని ప్రకటించాడు గుణశేఖర్. త్వరలో షూటింగ్ మొదలుపెట్టుకునే ‘యుఫోరియా‘ చిత్రంలో నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.

Related Posts