షార్ప్‌ రన్ టైమ్ తో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’

ఈమధ్య కాలంలో మన తెలుగు సినిమాలు రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకూ నిడివితో విడుదలవుతున్నాయి. పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే సినిమాలైతే దాదాపు మూడు గంటల నిడివితో వచ్చినవే ఎక్కువ ఉన్నాయి. అయితే.. వాటికి భిన్నంగా ఇప్పుడు ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ రాబోతుంది. విశ్వక్ సేన్ నటించిన ఫక్తు మాస్ ఎంటర్ టైనర్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ 2 గంటల 12 నిమిషాల షార్ప్ రన్ టైమ్ తో రాబోతుందట.

రేపు విడుదలవుతోన్న చిత్రాలలో హాట్ ఫేవరెట్ గా రంగంలోకి దిగుతోంది ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో విశ్వక్ కి జోడీగా అంజలి, నేహా శెట్టి నటించారు. యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం, నేపథ్య సంగీతం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’కి మరో ప్లస్ పాయింట్. మొత్తంమీద.. ‘గామి’ వంటి విజయంతో ఉన్న విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.

Related Posts