రాజమండ్రిలో అడుగుపెట్టిన ‘గేమ్ ఛేంజర్’

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అప్ కమింగ్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం చాన్నాళ్లుగా షూటింగ్ జరుపుకుంటోంది. శంకర్.. ఒకవైపు ‘భారతీయుడు 2’ మరోవైపు ‘గేమ్ ఛేంజర్’ని పూర్తిచేయాల్సి రావడంతో.. ఈ మెగా మూవీ ఆలస్యమవుతూ వస్తోంది.

ఇక.. లేటెస్ట్ గా ‘గేమ్ ఛేంజర్’ రాజమండ్రిలో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టుకోబోతుంది. అందుకోసం.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రాజమండ్రిలో అడుగుపెట్టాడు. చరణ్ ఎయిర్‌పోర్టులో దిగగానే ఘన స్వాగతం పలికారు అభిమానులు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.

‘గేమ్ ఛేంజర్’ రాజమండ్రి షెడ్యూల్ ఒక వారం రోజుల పాటు జరగనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మేజర్ పార్ట్ చిత్రీకరణ పూర్తిచేసుకున్న ‘గేమ్ ఛేంజర్’ ఇదే ఏడాది విడుదలవుతుందనే ప్రచారం జరుగుతుంది. కానీ.. రిలీజ్ డేట్ పై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు.

తమన్ సంగీతాన్నందిస్తున్న ఈ మూవీ నుంచి ‘జరగండి జరగండి’ పాట విడుదలైంది. త్వరలోనే.. మరో సింగిల్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట నిర్మాత దిల్‌ రాజు.

Related Posts