ఫన్ అండ్ ఎమోషనల్ గా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ ట్రైలర్

విభిన్నమైన పాత్రలతో క్యారెక్టర్ యాక్టర్ గా ఫుల్ బిజీగా సాగుతోన్న అజయ్ ఘోష్ హీరోగా నటించిన చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. ఈ సినిమాలో అజయ్ ఘోష్ కి భార్య పాత్రలో సీనియర్ హీరోయిన్ ఆమని నటించగా.. ఇతర కీలక పాత్రలో చాందినీ చౌదరి కనిపించబోతుంది. ఫ్లై హై సినిమాస్ బ్యానర్ పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. శివ పాలడుగు ఈ సినిమాకి రచన, దర్శకత్వం వహించారు.

అసలు మే 31న రావాల్సిన ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ జూన్ 14న విడుదలకు ముస్తాబవుతోంది. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. మ్యూజిక్ అంటే ప్రాణంగా భావించే ఓ మిడిల్ క్లాస్ మ్యాన్ గా అజయ్ ఘోష్ కనిపించబోతున్నాడు. ఆర్థిక పరిస్థితులు, ఇంట్లో పరిస్థితులు అనుకూలించకపోయినా.. తానో డి.జె. కావాలని ఆశపడే మూర్తిగా అజయ్ ఘోష్ పాత్ర ఉంది. అందుకు సహకారం అందించే పాత్రలో చాందిని చౌదరి కనిపించబోతుంది. ట్రైలర్ ఆద్యంతం ఫన్ అండ్ ఎమోషనల్ రైడ్ గా ఉంది.

Related Posts