బాలకృష్ణ హ్యాట్రిక్ విజయానికి చిత్ర పరిశ్రమ అభినందనలు

నటసింహం నందమూరి బాలకృష్ణ చిత్ర పరిశ్రమకు వచ్చి 50 ఏళ్లు పూర్తవుతున్నాయి. తన సుధీర్ఘ కెరీర్ లో కథానాయకుడిగా ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ అందించారు. ఒకవైపు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా వెలుగొందుతూనే.. మరోవైపు బసవతారకం హాస్పిటల్ తో బిజీగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలలో ముంటుంటారు బాలయ్య.

ఇక.. తండ్రి వారసత్వంగా రాజకీయాల్లో సైతం అడుగుపెట్టిన నటసింహం.. ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి, తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్.. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు అభినందనలు తెలిపాయి.

ఈ కార్యక్రమంలో తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి అధ్యక్షులు శ్రీ కె. ఎల్. దామోదర్ ప్రసాద్, కార్యదర్శి శ్రీ టి. ప్రసన్నకుమార్, తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి అధ్యక్షులు శ్రీ వి. వెంకటరమణ రెడ్డి (దిల్ రాజు), కార్యదర్శి శ్రీ కె. ఎల్. దామోదర్ ప్రసాద్, కోశాధికారి శ్రీ టి. ప్రసన్నకుమార్, తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి శ్రీ కె. అనుపం రెడ్డి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ మాదాల రవి పాల్గొన్నారు.

Related Posts