ఎన్టీఆర్ లోని నట విశ్వరూపాన్ని ఆవిష్కరించే ‘డ్రాగన్’

ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాల లైనప్ ఎంత క్రేజీగా ఉందో తెలిసిందే. సెప్టెంబర్ లో ‘దేవర’ను విడుదలకు ముస్తాబు చేస్తున్న తారక్.. వచ్చే యేడాది ‘వార్ 2’తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ రెండు సినిమాల షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు యంగ్ టైగర్. ఈ ఆగస్టు నుంచి మరో చిత్రాన్ని షురూ చేయబోతున్నాడు. అదే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా.

‘డ్రాగన్’ అనే టైటిల్ తో ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ను ఎంతో విభిన్నంగా డిజైన్ చేస్తున్నాడట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. హీరోల ఎలివేషన్స్ ను ఆన్‌స్క్రీన్ పై అద్భుతంగా ప్రెజెంట్ చేయడంలో ప్రశాంత్ నీల్ దిట్ట. నటనకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఎన్టీఆర్ వంటి నటుడు దొరికితే.. ఆ ఎలివేషన్స్ మరో లెవెల్ లో ఉంటాయి. అలాంటి గూస్‌బంప్స్ తీసుకొచ్చే సన్నివేశాలకు ‘డ్రాగన్’లో కొదవే ఉండదట.

ఇక.. ‘డ్రాగన్’లో ఎన్టీఆర్ క్యారెక్టర్ పూర్తిగా నెగటివ్ షేడ్స్ తో ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాని మేజర్ పార్ట్ ఫారెన్ లోనే చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నాడట ప్రశాంత్. అలాగే.. ఈ మూవీలో తారక్ కి జోడీగా రష్మిక నటించనుందనే ప్రచారం ఉంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.

Related Posts