దీపావళి ధమాకా స్ట్రాంగ్ గానే ఉంటుందా..?

ఫ్రైడే వచ్చిందంటే చాలు.. ఒక్కోసారి క్లియరెన్స్ సేల్ ను తలపించేలా వరుసగా వచ్చేస్తున్నాయి సినిమాలు. ఇంతకు ముందులా కాక ఈ సారి కాస్త పేరున్న సినిమాలే వస్తున్నాయి. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఓరి దేవుడా ఈ 21న విడుదలవుతోంది. విశ్వక్ సరసన మిథిలా పాల్కర్, ఆశాభట్ హీరోయిన్లుగా నటించారు. దేవుడి పాత్రలో వెంకటేష్ కనిపిస్తున్నారు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన ఓ మై కడవులే చిత్రానికి రీమేక్ గా వస్తోన్న ఈ మూవీకి ఒరిజినల్ ను రూపొందించిన అశ్వత్ మారిముత్తునే దర్శకుడు. ఇప్పటికే ఈ మూవీకి హిట్ కళ కనిపిస్తోందంటున్నారు.మంచు విష్ణు హీరోగా నటించిన జిన్నా కూడా ఈ 21నే విడుదల కాబోతోంది. విష్ణు సరసన పాయల్ రాజ్ పుల్, సన్నిలియోన్ హీరోయిన్లుగా నటించారు. జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వ పర్యవేక్షణలో సూర్యా అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన చిత్రం ఇది.

టీజర్, ట్రైలర్ తో ఇప్పటికే మంచి టాక్ తెచ్చుకుందీ సినిమా. విష్ణు ఫస్ట్ టైమ్ ఓ హారర్ కామెడ�