నైజాంలో డిస్ట్రిబ్యూటర్ – ఎగ్జిబిటర్ మధ్య పంపిణీ లెక్కలు ఇవే..!

తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వారం వారం సరైన సినిమాలు లేక థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు తగ్గిపోతున్నారు. మరోవైపు.. ఓటీటీలు థియేటర్లను బాగా భయపెడుతున్నాయి. ఈకోవలో.. థియేటర్లు నిర్వహణ కష్టమవుతుండడంతో కొన్ని మూత బడుతున్నాయి. ఈమధ్య తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్స్ ను పదిరోజుల పాటు మూసేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే.. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ మాత్రం ఈ విషయాన్ని ఖండించింది.

లేటెస్ట్ గా తెలంగాణ ఎగ్జిబిటర్ల సంఘం సమావేశం జరిగింది. సినిమాలు ఏ విధంగా షేరింగ్ మీద ప్రదర్శించాలి అనే దాని మీద వారు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. నైజాంలో సినిమాను కొన్న రేటు ప్రాతిపదికగా తొలివారం, మలి వారం.. ఆ తర్వాతి వారాల కలెక్షన్లను డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ ఏ ప్రాతిపదికన పంచుకోవాలి అన్నది నిర్ణయించారు.

ముఫై కోట్లకు పైబడిన రేటుకు నైజాంలో కొన్న సినిమాలకు తొలివారం డిస్ట్రిబ్యూటర్ కు 75శాతం ఎగ్జిబిటర్ కు 25శాతం ఉండాలని నిర్ణయించారు. ఇక.. రెండో వారం అయితే 55 శాతం – 45 శాతంగా.. ఆ తర్వాత వరుసగా 40-60, 30-70 శాతం లెక్కన డిస్ట్రిబ్యూటర్-ఎగ్జిబిటర్ మధ్య పంపిణీ ఉంటుంది.

10 కోట్ల నుంచి 30 కోట్ల రేటుకు నైజాంలో కొన్న సినిమాలకు తొలివారం డిస్ట్రిబ్యూటర్ కు 60 శాతం ఎగ్జిబిటర్ కు 40 శాతం లెక్కన పంపిణీ చేస్తారు. మలివారం 50-50, మూడోవారం 40-60, నాలుగోవారం 30-70 శాతం లెక్కన షేర్ చేసుకుంటారు

10 కోట్ల లోపు సినిమాలకు తొలివారం 50శాతం 50 శాతం వంతున డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు పంపిణీ చేస్తారు. రెండో వారం 40-60, మూడోవారం 30-70 వంతున ఆదాయం పంచుకుంటారు. అయితే.. ఈ మీటింగ్ కి ముందే డీల్స్ పూర్తైన ‘కల్కి, పుష్ప2, గేమ్ ఛేంజర్, ఇండియన్ 2’ వంటి సినిమాలకు ఈ కొత్త అగ్రిమెంట్ వర్తించదట.

Related Posts