సముద్ర తీరంలో ‘దేవర’ రొమాంటిక్ సాంగ్

‘ఆర్.ఆర్.ఆర్’ వంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తోన్న మూవీ ‘దేవర’. అందుకే.. ఈ సినిమాని ‘ఆర్.ఆర్.ఆర్’ స్థాయికి ఏమాత్రం తగ్గని రీతిలో తీర్చిదిద్దుతున్నారు మేకర్స్. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కూడా ఈ సినిమాతో తిరిగి ఫామ్ లోకి వచ్చేందుకు తీవ్రంగా కష్టపడుతున్నాడు. కంటెంట్ పరంగానూ, టెక్నికల్ పరంగానూ ‘దేవర’ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సరికొత్త బెంచ్‌ మార్క్ సెట్ చేసే విధంగా ఉండబోతుందనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్.

ఇప్పటికే ‘దేవర’ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చింది. ‘ఫియర్’ పేరుతో విడుదలైన ఈ పవర్‌ ఫుల్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇప్పుడు ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది టీమ్. ముందు నుంచీ చెప్పినట్టే ఇదొక రొమాంటిక్ డ్యూయెట్ అట. అయితే.. ఆద్యంతం సముద్ర తీరంలో చిత్రీకరించిన ఈ గీతంలో విజువల్ ఎఫెక్ట్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్టు చెబుతున్నారు.

హీరోహీరోయిన్లు ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మధ్య చిత్రీకరించిన ఈ గీతం సినీ ప్రియులకు ఎంతగానో నచ్చుతుందట. త్వరలోనే.. ‘దేవర’ సెకండ్ సింగిల్ పై అప్డేట్ ఇవ్వనుందట టీమ్. ఇక.. సెప్టెంబర్ 27న ‘దేవర’ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది.

Related Posts