నితిన్ ‘రాబిన్ హుడ్‘లో హీరోయిన్ పై రానున్న క్లారిటీ

‘భీష్మ‘ వంటి బడా హిట్ తర్వాత నితిన్-వెంకీ కుడుమల కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘రాబిన్ హుడ్‘. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాకి జీ.వి.ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇక.. ఈ మూవీలో తొలుత రష్మిక నాయికగా ఎంపికైంది. దీంతో.. ‘భీష్మ‘కి పనిచేసిన నితిన్, రష్మిక, వెంకీ కుడుముల కలిసి చేస్తున్న సినిమా ఇదంటూ ప్రచారం జరిగింది.

కానీ.. వేరే సినిమాలతో డేట్స్ క్లాష్ రావడంతో రష్మిక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఆ తర్వాత హీరోయిన్ గా శ్రీలీల పేరు వినిపించింది. ఇప్పుడు లేటెస్ట్ గా రాశీ ఖన్నా ఈ చిత్రంలో నటించబోతుందనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏదేమైనా.. రేపు (జూన్ 14) ఈ సినిమాలో నటించే బాస్ లేడీ పై క్లారిటీ ఇవ్వనుందట టీమ్. ఈ ఏడాది డిసెంబర్ 20న ‘రాబిన్ హుడ్‘ థియేటర్లలోకి రాబోతుంది.

Related Posts