ఆస్కార్ విజేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి

మరకతమణి కీరవాణికి మెగా హీరోలతో అరుదైన రికార్డు ఉంది. ఇప్పటివరకూ చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్ లకు కీరవాణి పనిచేసిన తొలి చిత్రంతోనే సూపర్ హిట్స్ ఇచ్చారు. ఈకోవలోనే.. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోనూ ‘హరిహర వీరమల్లు‘కి పనిచేస్తున్నారు కీరవాణి.

ఇక.. చిరంజీవితో కీరవాణి తొలి చిత్రం ఘరానామొగుడు’. 1992లో విడుదలైన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఈ సినిమా తర్వాత చిరంజీవి, కీరవాణి కాంబోలో ‘ఆపద్భాంధవుడు, ఎస్.పి.పరశురాం‘ వంటి సినిమాలొచ్చాయి. మళ్లీ మూడు దశాబ్దాల తర్వాత వీరిద్దరి కాంబోలో రూపొందుతోన్న మూవీ ‘విశ్వంభర‘. వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతి కానుకగా విడుదలకు ముస్తాబవుతోంది.

ఈరోజు (జూలై 4) కీరవాణి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆస్కార్ విజేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపుతూ.. కీరవాణితో తమ ఇంట్లో జరిగిన మ్యూజిక్ సిట్టింగ్స్ కు సంబంధించిన ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు చిరంజీవి. మరోవైపు.. ‘విశ్వంభర‘ చిత్రం షూటింగ్ జరుపుకుంటూనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంటుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ ఫార్మాలిటీస్ మొదలయ్యాయి.

Related Posts