బుజ్జి తో షికారు చేసిన చైతూ

రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి‘ చిత్రంలోని బుజ్జి కారు గురించి ఈమధ్య ప్రత్యేకమైన వీడియో విడుదల చేసింది టీమ్. దాదాపు రూ.7 కోట్ల రూపాయలతో మహింద్ర వంటి పెద్ద కంపెనీల టెక్నాలజీతో ఈ కారును డిజైన్ చేశారు. సినిమాలో ఈ కారుకు బుజ్జి అనే పేరు కూడా పెట్టారు. ఇటీవలే బుజ్జి పరిచయ వేడుకలో ప్రభాస్ ఈ కారును నడపడం.. ఆ వీడియోలు ఎంతో వైరల్ అవ్వడం జరిగింది.

లేటెస్ట్ గా బుజ్జి కారును మరో హీరో నాగచైతన్య నడిపాడు. పెద్ద రేసింగ్ కోర్స్ లా ఉన్న లొకేషన్ లో బుజ్జి కారుపై రయ్ రయ్ అంటూ దూసుకెళ్లాడు చైతన్య. అందుకు సంబంధించిన వీడియోని నిర్మాణ సంస్థ వైజయంతీ విడుదల చేసింది. ఇక.. ‘బుజ్జి‘ కోసం ఇంజినీరింగ్ రూల్స్ అన్నీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ బ్రేక్ చేసినట్టు ఈ వీడియోలో తెలిపాడు నాగచైతన్య. ఇప్పటికే బుజ్జి కారు గురించి.. సినిమాలో ఆ కారు పాత్ర గురించి లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ కూడా ఎన్నో పొగడ్తలు కురిపించారు. ‘కల్కి 2898 ఎ.డి.‘ చిత్రం జూన్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది.

Related Posts