బన్నీకి వర్కవుట్ అవ్వలేదు.. నాని కి అవుతోందా?

హిట్టైన కాంబినేషన్స్ ను మళ్లీ రిపీట్ చేయడానికి మేకర్స్ ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తారు. అలా సెట్టైన క్రేజీ కాంబో నాని-శ్రీకాంత్ ఓదెల. వీరిద్దరూ కలిసి ఇప్పటికే ‘దసరా’ వంటి సూపర్ హిట్ అందించారు. సుకుమార్ కాంపౌండ్ నుంచి వచ్చిన శ్రీకాంత్ ఓదెల.. ‘దసరా’ సినిమాని తీర్చిదిద్దిన విధానానికి అందరూ ఫిదా అయ్యారు. ఈ సినిమాలో నానిని ధరణి పాత్రలో ఆద్యంతం రస్టిక్ లుక్ లో ప్రెజెంట్ చేసి వావ్ అనిపించాడు. ఇప్పుడు మరోసారి నానితో సినిమా చేయబోతున్నాడు శ్రీకాంత్.

ఈ చిత్రం కూడా 1980ల కాలం నాటి కథతో సాగుతోందట. నిజ‌మైన నాయ‌కుడికి ఐడెంటిటీ అవ‌స‌రం లేదు అనే స్లోగన్ తో ఆమధ్య విడుదలైన ఈ మూవీ అనౌన్స్‌మెంట్ పోస్టర్ కి మంచి అప్లాజ్ వచ్చింది. ఇక.. ఈ సినిమాలో నానితో పాటు మరో కీలక పాత్ర ఉంటుందట. ఆ క్యారెక్టర్ కోసం కోలీవుడ్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని ఒప్పించే ప్రయత్నంలో ఉన్నాడట డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. గతంలో తన గురువు సుకుమార్ ‘పుష్ప’ కోసం విజయ్ సేతుపతిని తీవ్రంగా ట్రై చేశాడు. కానీ.. వర్కవుట్ కాలేదు. మరి.. ఇప్పుడు శిష్యుడు శ్రీకాంత్ ఓదెల అది సాధించి తీరతాడేమో చూడాలి.

Related Posts