మురుగదాస్-శివకార్తికేయన్ సినిమాలో బాలీవుడ్ హీరో

మురుగదాస్.. సౌతిండియాలోని ఒన్ ఆఫ్ ది స్టార్ డైరెక్టర్స్ లో ఒకడు. వెండితెరపై భారీతనానికి, సందేశాత్మక కథాంశాలకు పెద్ద పీట వేసే ఈ డైరెక్టర్ కొన్నేళ్లుగా సరైన హిట్ కు దూరమయ్యాడు. రజనీకాంత్ తో ‘దర్బార్’ తీసిన తర్వాత నాలుగేళ్లు గ్యాప్ తీసుకున్న మురుగదాస్.. ప్రస్తుతం శివకార్తికేయన్ తో సినిమా తెరకెక్కిస్తున్నాడు. శివకార్తికేయన్ కెరీర్ లో 23వ చిత్రమిది.

ఈ మూవీలో ‘సప్తసాగరాలు దాటి’ ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే.. బాలీవుడ్ యాక్షన్ స్టార్ విద్యుత్ జమ్వాల్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. లేటెస్ట్ గా ఈ ప్రాజెక్ట్ లోకి విద్యుత్ జమ్వాల్ ఎంట్రీ జరిగింది. అందుకు సంబంధించి ఓ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేసింది టీమ్. ఇక.. గతంలోనే మురుగదాస్ దర్శకత్వం వహించిన ‘తుపాకీ’లో విలన్ పాత్రలో కనిపించాడు విద్యుత్. ఈ సినిమాలోనూ ప్రధాన ప్రతినాయకుడిగా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. అనిరుధ్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నాడు. ఫుల్ లెన్త్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా మురుగదాస్-శివకార్తికేయన్ సినిమా రూపొందుతోంది.

Related Posts