భారీ నిడివితోనే వస్తోన్న ‘భారతీయుడు 2’

గతంలో రెండున్నర గంటల నిడివితోనే ఎక్కువ సినిమాలు వచ్చేవి. అయితే.. కొన్ని సంవత్సరాలుగా నిడివి విషయంలో ఎలాంటి కండిషన్స్ పెట్టుకోవడం లేదు మేకర్స్. రెండేసి భాగాలుగా వచ్చే సినిమాలను సైతం.. మూడు గంటల నిడివితో విడుదల చేస్తున్నారు. ఇటీవలే విడుదలైన ‘కల్కి’ అందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంఫుల్.

లేటెస్ట్ గా ‘భారతీయుడు 2’ కూడా మూడు గంటలకు పైగా నిడివితో వస్తోంది. సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తిచేసుకుని ‘యు/ఎ’ సర్టిఫికెట్ పొందిన ‘భారతీయుడు 2’ చిత్రం 3 గంటల 4 సెకన్ల నిడివితో రాబోతుందట. ఇప్పటికే దేశ, విదేశాల్లో ‘భారతీయుడు 2’ ప్రచారాన్ని హోరెత్తిస్తుంది టీమ్. జూలై 7న తెలుగులో ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారట. జూలై 12న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ‘భారతీయుడు 2’ విడుదలకు సిద్ధమవుతోంది.

Related Posts