‘భగవంత్ కేసరి’ బాలీవుడ్ లోనూ బంపర్ హిట్

మన టాలీవుడ్ హీరోలు చాలామంది బాలీవుడ్ లో డైరెక్ట్ గా సినిమాలు చేయకపోయినా.. తమ చిత్రాల అనువాద రూపంలో హిందీ ఆడియెన్స్ ను అలరిస్తూనే ఉన్నారు. అందుకే.. టాలీవుడ్ మూవీస్ కి బాలీవుడ్ లో మంచి గిరాకీ ఉంది. మన సినిమాల హిందీ డబ్బింగ్ రైట్స్ ను కోట్లు పెట్టి కొనుక్కుంటుంటారు బాలీవుడ్ మేకర్స్.

ఇక.. నటసింహం బాలకృష్ణకి కూడా నార్త్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. డైరెక్ట్ గా ఒక్క హిందీ చిత్రం చేయకపోయినా.. తన డబ్బింగ్ మూవీస్ తో హిందీ బెల్ట్ లో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు బాలయ్య. లేటెస్ట్ గా బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ సినిమా హిందీ వెర్షన్ యూట్యూబ్ లో 50 మిలియన్ల వ్యూస్ ను కొల్లగొట్టింది.

బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘భగవంత్ కేసరి’ తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. ఈ మూవీ చూసిన వాళ్లంతా.. ‘ఈ సినిమా షానా ఏండ్లు యాదుంటది.!’ అంటూ ముక్తం కంఠంతో చెప్పారు. గతేడాది దసరా కానుకగా విడుదలైన ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. ఈ మూవీలో బాలయ్యకి కూతురు తరహా పాత్రలో శ్రీలీల నటిస్తే.. జోడీగా కాజల్ సందడి చేసింది.

Related Posts