ఎంతో ప్రత్యేకమైన రోజున ‘బిబి-4’ ముహూర్తం

నటసింహం బాలకృష్ణ- మాస్ స్పెషలిస్ట్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో నాల్గవ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై ఈ సినిమాని రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అంతవరకూ బాగానే ఉంది. అయితే.. ఈ సినిమా ఎప్పుడు ముహూర్తాన్ని జరుపుకుంటోంది? అనే ఆసక్తి మాత్రం నందమూరి అభిమానుల్లో మెండుగా ఉంది.

లేటెస్ట్ ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్ ప్రకారం ‘బిబి-4’ చిత్రం ఆగస్టు 30న ముహూర్తాన్ని జరుపుకోబోతున్నట్టు తెలుస్తోంది. అంటే.. బాలకృష్ణ తొలి చిత్రం ‘తాతమ్మకల’ విడుదలైన తేదీ అది. 1974, ఆగస్టు 30న ‘తాతమ్మకల’ రిలీజయ్యింది. నటరత్న ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాని రూపొందించారు. ‘తాతమ్మకల’ విడుదలై.. రాబోయే ఆగస్టు 30కి 50 వసంతాలు పూర్తవుతోంది. అంటే.. నటుడిగా అడుగుపెట్టి నటసింహం కు 50 ఏళ్లన్నమాట. ఆ ప్రత్యేకమైన రోజునే బాలకృష్ణ-బోయపాటి ‘బిబి-4’ ముహూర్తాన్ని జరపనున్నారట.

Related Posts