ఎన్టీఆర్-జాన్వీ మాస్ డ్యూయెట్ కి సర్వం సిద్ధం

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లోని మాస్ యాంగిల్ ను మరింత ఎలివేట్ చేసే మూవీ ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో తారక్ నెవర్ బిఫోర్ మేకోవర్ తో మెస్మరైజ్ చేయబోతున్నాడు. ఈ మూవీలో ఎన్టీఆర్ చేసే ఫైట్స్ ఓ రేంజులో ఉంటాయనే ప్రచారం ఇప్పటికే ఉంది. ఇక.. డ్యాన్సుల గురించి చెప్పేదేముంది. ఈ మూవీలోని తారక్ చేసే డ్యాన్సెస్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తాయట. ముఖ్యంగా.. ఓ మాస్ డ్యూయెట్ లో యంగ్ టైగర్ వేసే స్టెప్పులకు బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయమనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్.

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తొలిసారిగా దక్షిణాదిన నటిస్తున్న చిత్రం ‘దేవర’. ఈ సినిమాలో ఎన్టీఆర్, జాన్వీ మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ ను ఇప్పటికే షూట్ చేశారు. లేటెస్ట్ గా ఈ మూవీలోని ఓ మాస్ బీట్ సాంగ్ ను చిత్రీకరించడానికి సిద్ధమవుతున్నారు. జూలై 10 నుంచి శంషాబాద్ లో వేసిన ఓ ప్రత్యేకమైన సెట్ లో ఎన్టీఆర్, జాన్వీ మధ్య ఆ మాస్ డ్యూయెట్ ను చిత్రీకరించనున్నారట. అనిరుధ్ అందించిన మాసీ ట్యూన్ కి.. శేఖర్ మాస్టర్ స్టెప్పులు ఈ పాటకు అదనపు ఆకర్షణగా నిలుస్తాయంటున్నారు. సినిమాలో ఒన్ ఆఫ్ ది హైలైట్స్ గా ఈ పాట ఉండబోతున్నట్టు తెలుస్తోంది. రెండు భాగాలుగా రెడీ అవుతోన్న ‘దేవర’ సిరీస్ లోని ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న విడుదలవుతోంది.

Related Posts