పిల్లలు, ఫీజులు గురించి ‘జనక అయితే గనక‘

అగ్ర కథానాయకులతో పూర్తిస్థాయి కమర్షియల్ సినిమాలను తమ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై తీస్తున్నాడు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఇక.. కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ కోసం దిల్ రాజు ప్రొడక్షన్స్ ను స్థాపించాడు. ‘బలగం‘ వంటి బ్లాక్ బస్టర్ అందించిన ఈ ప్రొడక్షన్ నుంచి ఇప్పుడు సుహాస్ హీరోగా నటిస్తున్న ‘జనక అయితే గనక‘ సినిమా రాబోతుంది.

దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి నిర్మాతలుగా సందీప్ రెడ్డి బండ్ల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ‘బేబి‘ ఫేమ్ విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి టీజర్ రిలీజయ్యింది.

మధ్య తరగతి జీవితాన్ని అనుభవించే కథానాయకుడు.. పెళ్లైన తర్వాత తన పిల్లలను పెద్ద స్కూళ్లలో చదివించాలని ఆశపడతాడు. కానీ.. తనకు అలాంటి అవకాశం లేకపోవడంతో ఫీజులు కట్టడానికి భయపడి పిల్లలనే కనడానికి ఇష్టపడడు. నేటితరం సమాజాన్ని ప్రతిబింబిస్తూ తెరకెక్కించిన ‘జనక అయితే గనక‘ టీజర్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో సుహాస్ కి జోడీగా సంగీర్తన నటిస్తుంది. ఇతర కీలక పాత్రల్లో రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కనిపించనున్నారు.

Related Posts