‘హరోం హర’ నుంచి మెలోడియస్ రొమాంటిక్ సాంగ్

నైట్రో స్టార్ సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ ‘హరోం హర’. సినిమా సినిమాకి విలక్షణమైన కథలతో ప్రయోగాలు చేయడానికి ఇష్టపడే సుధీర్.. ఈ మూవీలో ఓ వైవిధ్యభరితమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఆద్యంతం పీరియడిక్ బ్యాక్ డ్రాప్ లో ఙ్ఞానశేఖర్ ద్వారక దర్శకత్వంలో ‘హరోం హర’ రూపొందుతోంది. ఈ సినిమాలో సుధీర్ కి జోడీగా మాళవిక శర్మ నటిస్తుంది. చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూరుస్తోన్న ‘హరోం హర’ నుంచి లేటెస్ట్ గా ‘కనులెందుకో కలిసేను కల ఇలా’ అంటూ సాగే మెలోడియస్ రొమాంటిక్ సాంగ్ రిలీజయ్యింది.

వేంగి సుధాకర్ సాహిత్యాన్నందించిన ఈ గీతాన్ని నిఖిత శ్రీవల్లి ఆలపించింది. సుధీర్, మాళవిక శర్మ లపై హృదయానికి హత్తుకునే రీతిలో మంచి మాంటేజెస్ తో ఈ పాటను తీర్చిదిద్దాడు డైరెక్టర్ ఙ్ఞానశేఖర్. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ జి.నాయుడు నిర్మిస్తున్న ‘హరోం హర’ మే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పాన్ ఇండియా లెవెల్ లో ‘హరోం హర’ విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts