సీనియర్ హీరో తొట్టెంపూడి వేణుపై కేసు నమోదు

సీనియర్ హీరో తొట్టెంపూడి వేణుపై కేసు నమోదైంది. ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ నిర్వహకులైన కావూరి భాస్కర్ రావుతో పాటు వేణు తదితరులపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది రీత్విక్ ప్రాజెక్ట్స్. కొన్నేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న వేణు.. కనస్ట్రక్షన్ ఫీల్డ్ లో బిజీగా ఉన్నాడు. కనస్ట్రక్షన్ బిజినెస్ కు సంబంధించిన అంశాల నేపథ్యంలోనే.. ప్రోగ్రెసివ్ కనస్ట్రక్షన్, రిత్విక్ ప్రాజెక్ట్స్ మధ్య వివాదం నెలకొన్నట్టు తెలుస్తోంది. అయితే.. ఈ కేసుకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు.. లాంగ్ గ్యాప్ తర్వాత వేణు ఇటీవలే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. రవితేజ హీరోగా నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ‘లో కీలక పాత్రలో కనిపించాడు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ‘అతిథి‘ అనే వెబ్ సిరీస్ లోనూ నటించాడు. ప్రస్తుతం వేణు కిట్టీలో మరికొన్ని ప్రాజెక్ట్స్ పైప్ లైన్లో ఉన్నాయి.

Related Posts