‘సరదా సరదాగా‘ ఆకట్టుకుంటోన్న ‘సైంధవ్‘ సాంగ్

విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ మూవీ ‘సైంధవ్‘. వెంకీ కెరీర్ లో 75వ చిత్రంగా ఇది తెరకెక్కుతోంది. శైలేష్ కొలను డైరెక్షన్ లో నిహారిక్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘సైంధవ్‘ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ కి మంచి రెస్పాన్స్ రాగా.. లేటెస్ట్ గా సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు. సంతోష్ నారాయణన్ స్వరకల్పనలో ‘సరదా సరదాగా‘ అంటూ సాగే ఈ గీతాన్ని రామజోగయ్య శాస్త్రి రాయగా.. అనురాగ్ కులకర్ణి ఆలపించాడు.

తెలుగులో అన్ని తరహా పాత్రలు పోషించగల సత్తా ఉన్న నటుడు వెంకటేష్. అందుకే వెంకీని అన్ని వర్గాల ప్రేక్షకులు అభిమానిస్తుంటారు. ఒకవిధంగా వెంకటేష్ ను ఫ్యామిలీ స్టార్ అనొచ్చు. ఇప్పుడు ‘సైంధవ్‘ నుంచి వచ్చిన సెకండ్ సింగిల్ ఫక్తు ఫ్యామిలీ సాంగ్ లా ఆకట్టుకుంటోంది. హీరో వెంకటేష్, హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్, బేబీ సారా లతో చిత్రీకరించిన ఈ గీతంలో కుటుంబ బాంధవ్యాలను తెలిపే మాంటేజ్ షాట్స్ మెస్మరైజ్ చేసేలా ఉన్నాయి. విడుదలైన గంటల్లోనే ఈ పాట ట్రెండింగ్ లోకి దూసుకెళ్లింది.

Related Posts