అంజి పాత్రలో అదరగొట్టబోతున్న అల్లరి నరేష్

‘నా సామిరంగ‘ సినిమాలో నాగార్జున యాక్షన్ తో పాటు రొమాన్స్ ను కూడా పంచబోతున్నాడు. అయితే ఈ సినిమాలో ఫుల్ లెన్త్ ఫన్ అందించడానికి మరో అదనపు ఆకర్షణ రెడీ అయ్యింది. అదే అల్లరి నరేష్. ఈ మూవీలో అంజి పాత్రలో అలరించనున్నాడు ఈ అల్లరోడు. లేటెస్ట్ గా ఈ మూవీలో అల్లరి నరేష్ పోషించిన అంజి క్యారెక్టర్ ఇంట్రో గ్లింప్స్ రిలీజ్ చేశారు.

నాగార్జునకు స్నేహితుడి పాత్రలో సినిమా ఆద్యంతం వినోదం పంచేలా ఈ క్యారెక్టర్ ను డిజైన్ చేసినట్టు గ్లింప్స్ ను బట్టి తెలుస్తోంది. ఏదైనా చేయకపోతే ‘మాటొచ్చేత్తది..‘ అనే ఊతపదంతో అల్లరి నరేష్ రోల్ ఫుల్ జోష్ లో కనిపిస్తుంది. విజయ్ బిన్ని డైరెక్షన్ లో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జునకి జోడీగా ఆషిక రంగనాథ్ నటిస్తుంది. మరో కీలక పాత్రలో రాజ్ తరుణ్ కనిపించనున్నాడు. ఆస్కార్ విజేత కీరవాణి సంగీతాన్ని సమకూర్చడం మరో విశేషం. సంక్రాంతి కానుకగా ‘నా సామిరంగ‘ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Related Posts