‘సలార్ 2‘పై సాలిడ్ హింట్ ఇచ్చిన టీమ్

శాండల్ వుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒక సినిమా చేసి.. మరో రెండు మూడు ప్రాజెక్ట్స్ ను సీక్వెల్స్ రూపంలో ప్రకటిస్తున్నాడు. అలా.. ప్రశాంత్ కిట్టీలో ఇప్పటికే ‘కె.జి.యఫ్ 3, సలార్ 2‘ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ‘కె.జి.యఫ్ 3‘ పట్టాలెక్కడానికి ఇంకా సమయం ఉన్నా.. ‘సలార్ 2‘ని మాత్రం ఇప్పటికే మొదలుపెట్టినట్టు ప్రచారం జరిగింది. ‘సలార్‘ మొదటి భాగంలో కథ గురించి పెద్దగా చర్చ లేదు. అసలు విషయం అంతా ‘సలార్‘ రెండో భాగం ‘శౌర్యాంగపర్వం‘లోనే ఉంది. ఇక.. ‘సలార్ 2‘ ఈ ఏడాది చివరి వరకూ పూర్తవుతోందని.. వచ్చే యేడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయని జోరుగా ప్రచారం సాగింది.

కానీ.. ఇటీవల ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా తారక్ తో చేయబోయే సినిమాని ఈ ఆగస్టు నుంచే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు ప్రకటించాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. దాంతో.. ‘సలార్ 2‘ ఆగిసోయిందనే రూమర్స్ జోరుగా స్ప్రెడ్ అయ్యాయి. లేటెస్ట్ గా అలాంటి రూమర్స్ కు చెక్ పెడుతూ ‘సలార్‘ టీమ్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ వదిలింది. ‘దే కాంట్ స్టాప్ లాఫింగ్‘ అంటూ ప్రభాస్, ప్రశాంత్ నీల్ సెట్స్ లో నవ్వుతోన్న ఫోటోని ‘ఎక్స్‘లో షేర్ చేసింది.

Related Posts