టాలీవుడ్ కి అసలు సిసలు కింగ్ ప్రభాస్

గడిచిన దశాబ్ద కాలంగా తెలుగు చిత్ర పరిశ్రమ బాగా పుంజుకుంది. కలెక్షన్ల పరంగా ఇండియన్ సినీ ఇండస్ట్రీకి ఓ బెంచ్ మార్క్ సెట్ చేసే స్థాయికి చేరింది. ఇక.. తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుగుదలలో ‘బాహుబలి’ కీలక పాత్ర పోషిస్తే.. ఆ పాత్రను పోషించిన ప్రభాస్ టాలీవుడ్ ని మరింత ముందుకు తీసుకెళుతున్నాడు.

ప్రెజెంట్ టాలీవుడ్ టాప్-10 గ్రాసర్స్ లో ఆరు చిత్రాలు ప్రభాస్ వే కావడం విశేషం. ఒక్కసారి ఆ పది సినిమాల విషయానికొస్తే.. నంబర్ 1లో ఇప్పటికీ ‘బాహుబలి 2’ ఉంది. 2017లో వచ్చిన ‘బాహుబలి 2’.. ప్రపంచవ్యాప్తంగా రూ.1810 కోట్లు వసూళ్లను సాధించింది. ఆ తర్వాతి స్థానంలో రూ.1387 కోట్లతో ‘ఆర్.ఆర్.ఆర్’ నిలవగా.. మూడో స్థానంలో ‘సలార్’, నాల్గవ స్థానంలో ‘బాహుబలి 1’, ఐదో స్థానంలో ‘కల్కి’, ఆరవ స్థానంలో ‘సాహో’ ఉన్నాయి. ఇక.. ప్రభాస్ ఫ్లాప్ మూవీ ‘ఆదిపురుష్’ వరల్డ్ వైడ్ గా రూ.354 కోట్లు కొల్లగొట్టి 8వ స్థానంలో ఉంది.

ఈ టాప్-10 లిస్ట్ లో ప్రభాస్ వి ఆరు చిత్రాలుంటే.. అల్లు అర్జున్ వి రెండు సినిమాలున్నాయి. వీటిలో ఒకటి ‘పుష్ప 1’ కాగా.. మరొకటి ‘అల.. వైకుంఠపురములో’. ప్రభాస్ 6, అల్లు అర్జున్ 2 సినిమాలతో పాటు.. టాలీవుడ్ టాప్-10 గ్రాసర్స్ లో చోటు సంపాదించుకున్న మిగతా రెండు సినిమాలు ‘ఆర్.ఆర్.ఆర్, హనుమాన్’ మాత్రమే.

Related Posts