‘సత్యభామ’ ట్రైలర్.. కాప్ రోల్ లో అదరగొట్టిన కాజల్

ఇప్పటివరకూ గ్లామరస్ రోల్స్ లో మురిపించిన అందాల చందమామ కాజల్ అగర్వాల్.. ఫస్ట్ టైమ్ ఫుల్ లెన్త్ సీరియస్ రోల్ లో కనిపించబోతున్న చిత్రం ‘సత్యభామ’. ఈ సినిమాలో కాజల్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటించింది. ‘గూఢచారి, మేజర్’ వంటి మూవీస్ లో తనదైన స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ శశికిరణ్ తిక్క.. ఈ మూవీకి స్క్రీన్ ప్లే సమకూరుస్తూనే.. ప్రెజెంటర్ గా వ్యవహరించారు. సుమన్ చిక్కాల దర్శకత్వంలో రూపొందిన ‘సత్యభామ’ మూవీ ట్రైలర్ ను నటసింహం బాలకృష్ణ రిలీజ్ చేశారు.

ట్రైలర్ విషయానికొస్తే.. ఒకరి తర్వాత ఒకరిగా అమ్మాయిలను కిడ్నాప్ చేసే ఓ సీరియల్ కిల్లర్ ను పట్టుకునే ఎ.సి.పి సత్యభామ గా కాజల్ రోల్ కనిపిస్తుంది. సస్పెన్స్, క్రైమ్, పాలిటిక్స్ ఇలా చాలా అంశాలు ట్రైలర్ లో కనిపించాయి. ముఖ్యంగా.. పోలీస్ పాత్రలో కాజల్ మేకోవర్ బాగుంది. ఇప్పటివరకూ యాక్షన్ జోలికి వెళ్లిన కాజల్.. ఈ మూవీలో స్టంట్స్ లో చెలరేగిపోయినట్టు ట్రైలర్ ను చూస్తేనే అర్థమవుతోంది. కాజల్ కి జోడీగా నవీన్ చంద్ర నటించగా.. ఇతర కీలక పాత్రల్లో రవి కృష్ణ, ప్రకాష్ రాజ్ వంటి వారు కనిపించబోతున్నారు. మొత్తంగా ట్రైలర్ తో అంచనాలను భారీగా పెంచేసిన ‘సత్యభామ’ జూన్ 7న థియేటర్లలోకి వస్తోంది.

Related Posts