రొమాంటిక్ మోడ్ లో ‘మిస్టర్ బచ్చన్’

మాస్ మహారాజ రవితేజ ఇప్పుడు మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. అప్ కమింగ్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’తో బడా హిట్ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘మిస్టర్ బచ్చన్’ ప్రమోషన్స్ లో జోరు పెంచుతున్నారు మేకర్స్. లేటెస్ట్ గా ‘మిస్టర్ బచ్చన్’ మ్యూజికల్ జర్నీకి శ్రీకారం చుట్టారు. మిక్కీ జె మేయర్ స్వరాలు అందిస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది. మొదటగా ఓ రొమాంటిక్ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు. అందుకు సంబంధించి ప్రోమో రిలీజయ్యింది. ఈ ప్రోమోలో రవితేజ, భాగ్యశ్రీ రొమాంటిక్ అవతార్ లో రెచ్చిపోతున్నారు. ఫుల్ సాంగ్ త్వరలోనే రానుంది.

Related Posts