‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘ యు.ఎస్.ఎ. రివ్యూ

నటీనటులు: విశ్వక్ సేన్, నేహా శెట్టి, అంజలి, నాజర్, సాయికుమార్, హైపర్ ఆది తదితరులు
సినిమాటోగ్రఫి: అనిత్ మద్దాడి
సంగీతం: యువన్ శంకర్ రాజా
ఎడిటింగ్‌: నవీన్ నూలీ
నిర్మాతలు: నాగవంశీ, సాయి సౌజన్య
దర్శకత్వం: కృష్ణ చైతన్య
విడుదల తేది: 31-05-2024

ఈమధ్య కాలంలో తెలుగులో మంచి వైవిధ్యభరిత కథా చిత్రాలతో దూసుకెళ్తున్న కథానాయకుల్లో విశ్వక్ సేన్ ముందు వరుసలో ఉంటాడు. ‘ఫలక్ నుమ దాస్, హిట్, పాగల్, అశోక వనంలో అర్జునకళ్యాణం, గామి‘ ఇలా.. ఒక సినిమాకి మరో చిత్రానికి సంబంధం లేకుండా సినిమా సినిమాకీ ఎంతో వైవిధ్యంగా అదరగొడుతున్నాడు ఈ టాలెంటెడ్ యాక్టర్. ఈ కోవలోనే మరో డిఫరెంట్ సబ్జెక్ట్ గా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘ సినిమా చేశాడు.

ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోన్న చిత్రాల్లో హాట్ ఫేవరెట్ గా రంగంలోకి దిగుతోంది ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘. ‘గామి‘ వంటి హిట్ తర్వాత మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నుంచి వస్తోన్న సినిమా ఇది. ప్రస్తుతం టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో మంచి ఫామ్ లో ఉన్న బడా ప్రొడక్షన్ హౌజ్ సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇప్పటికే పలుమార్లు వాయిదాలు పడ్డ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘ ఎట్టకేలకు ఆడియన్స్ ముందుకు వస్తోంది.

ఈ సినిమాలో మాస్ కా విశ్వక్ సేన్ కి జోడీగా క్యూట్ బ్యూటీ నేహా శెట్టి నటించింది. ఇప్పటికే సితార బ్యానర్ లో ‘డీజే టిల్లు‘ చిత్రంలో నటించి రాధిక గా మంచి గుర్తింపు తెచ్చుకుంది నేహా శెట్టి. ఇప్పుడు అదే సంస్థ నుంచి వస్తోన్న ఈ సినిమాలో మరో ప్రాధాన్యత గల పాత్రలో కనిపించిందట నేహా శెట్టి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో నేహా శెట్టి రోల్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక.. ఈ మూవీ నుంచి విడుదలైన విశ్వక్ సేన్, నేహా శెట్టి ‘సుట్టంలా సూసి‘ మెలోడీకి అయితే యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి.

గీత రచయితగా మంచి పేరు తెచ్చుకున్న కృష్ణ చైతన్య ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘కి దర్శకుడు. ఆద్యంతం గోదావరి జిల్లాల నేపథ్యంలో పీరియడిక్ స్టోరీగా ఈ సినిమాని తీర్చిదిద్దాడు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ మేకోవర్, డైలాగ్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇంకా.. అంజలి, సాయి కుమార్, నాజర్, హైపర్ ఆది వంటి క్యారెక్టర్స్ ను కృష్ణ చైతన్య తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకులకు నచ్చుతుందని చిత్రబృందం తెలిపింది.

టెక్నికల్ గానూ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘ హై స్టాండార్డ్ లో ఉంది. సౌతిండియాస్ టాప్ మ్యూజిక్ కంపోజర్స్ లో ఒకరైన యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. అనిత్ మద్దాడి సినిమాటోగ్రఫీ సమకూర్చాడు. ఇక.. మరికొద్ది గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘ థియేటర్లలో సందడి చేయబోతుంది. తెలుగు రాష్ట్రాల కంటే ముందే అమెరికాలో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘ ప్రీమియర్స్ మొదలయ్యాయి.

Related Posts