దిల్‌రాజు జడ్జ్‌మెంట్ తేడా కొడుతోంది..!

టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గానే కాదు.. స్టార్ డిస్ట్రిబ్యూటర్ గా కూడా దిల్ రాజుకు పేరుంది. ఒకవైపు నిర్మాతగా వరుస సినిమాలను నిర్మించే దిల్ రాజు.. మరోవైపు డిస్ట్రిబ్యూటర్ గానూ అగ్ర స్థానంలో కొనసాగుతుంటాడు. ఇక.. ఒక సినిమాకి సంబంధించి కథ ఎంపిక మొదలుకొని ప్రతీ విషయాన్ని దగ్గరుండి పరిశీలిస్తుంటాడు. అందుకే.. దిల్‌రాజు కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే అది సూపర్ హిట్ అవుతుందనే టాక్ ప్రేక్షకుల్లో ఉంది.

కానీ.. కొన్ని సినిమాలుగా దిల్‌రాజు జడ్జ్‌మెంట్ గాడి తప్పుతోంది. గతంలో హ్యాట్రిక్స్, డబుల్ హ్యాట్రిక్స్ అన్న రీతిలో వరుస విజయాలందుకున్న దిల్‌రాజుకి ఇప్పుడు ఫ్లాపుల పరంపర మొదలైంది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో పరశురామ్ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన ‘ది ఫ్యామిలీ స్టార్’ సినిమా ఎన్నో అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. తీరా చూస్తే.. కథ, కథనాలలో కొత్తదనం లేక సినిమా ఫ్లాప్ అయ్యింది.

ఇక.. రీసెంట్ గా వచ్చిన ‘లవ్ మీ’ కూడా ఆశించిన రివ్యూస్ అందుకోలేకపోయింది.లేటెస్ట్ రిజల్ట్స్ నేపథ్యంలో మళ్లీ తన జడ్జ్‌మెంట్ కు పదును పెట్టే పనిలో ఉన్నాడట దిల్‌రాజు. ఇప్పటికే పూర్తైన కొన్ని సినిమాలను మళ్లీ రీషూట్ చేయిస్తున్నాడట.

ఈలిస్టులో ఆశిష్ ‘సెల్ఫిష్’, డ్యాన్స్ మాస్టర్ యష్ హీరోగా నటిస్తున్న ‘ఆకాశం దాటి వస్తావా’ ఉన్నాయి. ఇంకా.. ఇప్పటికే సెట్స్ పై ఉన్న ‘గేమ్ ఛేంజర్, తమ్ముడు’ వంటి సినిమాలతో పాటు.. త్వరలో పట్టాలెక్కే మరికొన్ని సినిమాల స్క్రిప్ట్ విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.

Related Posts